మీడియా ముందుకు మరోసారి సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్

  • ఆపరేషన్ సిందూర్ తర్వాత మీడియా ముందుకు వచ్చిన అధికారిణులు
  • ఇప్పుడు మరోసారి రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడి
  • వారితో పాటు నేవీ కమాండర్ కూడా మీడియా ముందుకు..
కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మరోసారి మీడియా ముందుకు రానున్నారు. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గత సంవత్సరం పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో, భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్' చేపట్టిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ వివరాలను వెల్లడించేందుకు ఈ ఇద్దరు అధికారిణులు మీడియా ముందుకు వచ్చారు.

వీరిద్దరు మరోసారి మీడియా ముందుకు రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వీరితో పాటు నేవీ కమాండర్ ప్రేరణా దేవస్థలి, మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ బ్రీఫింగ్‌లో వారు ఆపరేషన్ సిందూర్ మెరుపు దాడులకు సంబంధించిన వివరాలు, ప్రాముఖ్యత, దాని వెనుక జరిగిన ప్రణాళిక వంటి విషయాల గురించి మాట్లాడే అవకాశముంది.

సోఫియా ఖురేషీ గుజరాత్‌కు చెందినవారు. బయోకెమిస్ట్రీలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1990లలో సైన్యంలో చేరారు. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, భారత వైమానిక దళంలోని హెలికాప్టర్ పైలట్‌గా పని చేశారు. 2019లో ప్లయింగ్ బ్రాంచ్‌లో శాశ్వత కమిషన్ హోదాను పొందారు.

మే 7తో ఆపరేషన్ నిర్వహించి ఏడాది పూర్తవుతుండడంతో వీరు మీడియా ముందుకు వస్తున్నట్టు తెలుస్తోంది.

Sofia Qureshi
Vyomika Singh
Operation Sindoor
Indian Army
Pahalgam Terrorist Attack
Indian Navy

More Telugu News